![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -203 లో.. కావ్యకి రాజ్ సపోర్ట్ చేసి అపర్ణదే తప్పని చెప్పినందుకు అపర్ణ పట్టరాని కోపంగా ఉంటుంది. ఇంట్లో అందరూ కలిసి నన్ను ఒంటరి చేసి ఈ కావ్యదేం తప్పు లేదన్నారు. తప్పు అంత నాదే అని అంటున్నారు. అందుకు నాకు నేనే శిక్ష వేసుకుంటున్న ఈ దుగ్గిరాల కుటుంబం నుండి నన్ను వెలివెయ్యండని చెప్పి అపర్ణ అనగానే.. అలా మాట్లాడకు మమ్మీ అని రాజ్ అంటాడు. నువ్వు మాట్లాడకంటూ రాజ్ పై అపర్ణ కోప్పడుతుంది.
మరొక వైపు స్వప్నకి కనకం ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది. మరొక వైపు కోపంగా ఉన్న అపర్ణని చూసి మరింత కోపం రావాలని రుద్రాణి రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. నువ్వు ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావ్ వదిన అంటూ తన నటనని స్టార్ట్ చేస్తుంది రుద్రాణి. నీ కొడుకుని నీకు దూరం చేసింది. ఎప్పుడు ఎదరు తిరగని రాజ్ ఈ రోజు నీది తప్పని చెప్పాడు. రాజ్ ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. నువ్వు ఇలా బాధపడుతుంటే కావ్యనే గెలిచానంటూ రెచ్చిపోతుందంటూ కావ్య పై అపర్ణకి మరింత ద్వేషం కలిగేలా రుద్రాణి చేస్తుంది. మరొక వైపు కృష్ణమూర్తి కావ్యకి ఫోన్ చేస్తాడు. ఈ రోజు నువ్వు రానవసరం లేదని చెప్పగానే కావ్య సరే అంటుంది. మరొక వైపు అపర్ణ మాటలు గుర్తుచేసుకుంటు రాజ్ బాధపడతాడు. ఆ తర్వాత రాజ్ అపర్ణ దగ్గరకి మాట్లాడాలని వస్తాడు. అయిన అపర్ణ మాట్లాడడానికి ఇష్టపడదు. నువ్వు నీ భార్యని అర్థం చేసుకోవడం మొదలు పెట్టావ్. అది చాలు హాయిగా సంసారం చేసుకోండి. మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరని అపర్ణ అనగానే.. నాకు నీ కంటే ఎవరు ముఖ్యం కాదని రాజ్ అంటాడు. అక్కడ చెప్పాలిసిన మాట ఇక్కడ చెప్తున్నావంటూ అపర్ణ ఎమోషనల్ అవుతుంది. నాకు ఈ ప్రపంచంలో నీ కంటే ఎవరు ఎక్కువ కాదు. నన్ను అర్థం చేసుకుంటావనుకుంటున్నానని రాజ్ అంటాడు.
మరొక వైపు అప్పు దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. అనామికని ప్రేమిస్తున్న విషయం చెపుదాం అనుకుంటాడు. కానీ అనామిక ఒప్పుకోకుంటే అప్పు నన్ను ఏడిపిస్తుంది. అనామిక నా ప్రేమని యాక్సెప్ట్ చేశాకే చెప్తానని కళ్యాణ్ అనుకుంటాడు. మరొక వైపు అపర్ణ కూరగాయలు కట్ చేస్తుంటుంది. ధాన్యలక్ష్మి చూసి షాక్ అవుతుంది. మా అక్క పని చేస్తుందని అనుకుంటుంది. అప్పుడే రుద్రాణి వచ్చి మీ అక్క వేరుగా వంట చేసుకుంటుందని చెప్తుంది. ఆ తర్వాత రుద్రాణి కావ్య దగ్గరకి వెళ్లి.. నీ వల్ల రాజ్ తన తల్లిని తప్పుపట్టాడని చెప్తుంది. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి కావ్య మాట్లాడడానికి వెళ్లగానే.. కావ్య మొహంపైనే అపర్ణ డోర్ వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |